Breaking News

ట్రంప్ ని ర్ణయాలు వర్ధమాన దేశాల విద్యార్థులకు, ఉద్యోగులకు గొడ్డలిపెట్టు!

ట్రంప్ ని ర్ణయాలు వర్ధమాన దేశాల విద్యార్థులకు, ఉద్యోగులకు గొడ్డలిపెట్టు!

సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ చంద్రన్న

ఇటీవల అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ అదే రోజు వందలాది ప్రాజెక్టు ఫైల్స్ మీద సంతకాలు పెట్టి చరిత్ర రికార్డు సృష్టించినట్లు ప్రపంచ మీడియా మొత్తం చెవులు బొక్కలు పడేలా ప్రచారం చేశాయి. జో బైడెన్ అమెరికాను ఏకతాటి మీదకు తీసుకురాలేక పోయాడనీ, కమలా హారిస్ సైతం అమెరికన్ ప్రజల మనోభావాలను గెలుచుకోలేకపోయారనీ, ట్రంప్పై పూర్తి విశ్వాసంతోనే అధికారానికి తీసుకొచ్చినట్లు కూడా ప్రచారాలను లంకించుకున్నారు. ట్రంప్ విజయాన్ని ప్రపంచంలోని పలు దేశాలు స్వాగతిస్తున్నట్లు గొప్పగా ప్రకటించుకుంటున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అమెరికాలో అనేక సమస్యలు తెరమీదకు వచ్చాయి. ట్రంప్ తీసుకున్న ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు దుర్మార్గమైనవి. ట్రంప్ నిర్ణయాలు వర్ధమాన దేశాలలోని విద్యార్థులకు, ఉద్యోగులకు గొడ్డలిపెట్టుగా తయరయ్యాయని సిపిఐ (యం-యల్) న్యూడెమోక్రసీ కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ చంద్రన్న తెలిపారు.ప్రపంచంలోని వందలాది దేశాల నుండి విద్యార్థులు స్వంత పూచీకత్తుపై అప్పులు చేసుకుని చదువుకునేందుకు వీసాలపై అమెరికాకు రావడాన్ని ట్రంప్ సర్కార్ అడ్డుకుంటున్నది. సంవత్సరాల తరబడి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను, ఆర్ధిక పరిస్థితి సరిగాలేని విద్యార్థులు షాపుల్లో పార్ట్ టైమ్ జాబ్స్ చేయడాన్ని కూడా ట్రంప్ సర్కార్ అడ్డుకుంటున్నది. అక్రమ వలసలను అదుపు చేస్తున్నట్లు ట్రంపు పేర్కొంటున్నాడు. నిన్న మొన్నటి అంతర్జాతీయ వార్తలను పరిశీలిస్తే ఈ పరిస్థితి మనకు అర్ధమవుతున్నది. భారతదేశం నుండి అమెరికా వెళ్లిన వేలాది మంది విద్యార్థులను, పార్ట్ టైమ్ ఉద్యోగస్తులను ప్రత్యేకమైన విమానంలో ఖైదీలను పంపించినట్లుగా ఇండియాకు ట్రంప్ తిరిగి పంపించారు.అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడుగా ఎన్నిక కావాలనీ, దానికి అమెరికాలోని భారతీయులు తమ అమూల్యమైన ఓట్లు వేయాలనీ అమెరికాలోని భారతీయులకు భారత ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి ట్రంప్ వస్తే ఇండియాకు అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకుంటారని, భారత్కు ఎన్నో రకాలుగా సహకరిస్తారని మోడీ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ట్రంప్ నేడు హెచ్ 1బి వీసాల పై, అమెరికా పౌరసత్వంపై కఠినమైన నిర్ణయాలు తీసుకుని అమెరికాలోని భారతీయుల పట్ల, విద్యార్థులపట్ల, పార్ట్ టైమ్ ఉద్యోగుల పట్ల తన వ్యతిరేకతను ప్రకటించి దుర్మార్గుడిగా నిలిచారు. మోడీ – ట్రంపు ఫాసిస్టు విధానాలకు ఈ సంఘటనలు ప్రత్యక్ష నిదర్శనాలు.అమెరికా ఒక వైపు పాలస్తీనాపై ఇజ్రాయెల్ను దురాక్రమణ దాడులకు, మారణకాండకు ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ను రెచ్చగొడుతూ మధ్య ఆసియాలో తన కుటిల రాజకీయ ఎత్తుగడలను, దుర్మార్గమైన వ్యూహాలను ముందుకు తెస్తోంది. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలకు తెరలేపుతోంది. ప్రజలను ఊచకోత కోయిస్తోంది. తన క్రూర నేరస్త స్వభావాన్ని ప్రపంచ ప్రజల ముందు మరోసారి అమెరికా బట్టబయలు చేసుకొంటున్నది. కొన్ని దశాబ్దాలుగా రూపాయి విలువను పతనానికి తొక్కి డాలర్ను ఆకాశానికెత్తుకుంటూ ప్రపంచ మార్కెట్లను, మానవ వనరులను అమెరికా కొల్లగొడుతున్నది. దీనిని ప్రపంచ దేశాలు, ప్రపంచ మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రపంచ శాంతి కాముకులు ప్రతి ఒక్కరూ ఖండించాలని సిపిఐ (యం-యల్) న్యూడెమోక్రసీ కోరుతున్నది. ట్రంప్ తన నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది

ఒక సోక్రటీస్‌.. ఒక భగత్‌ సింగ్‌

.విప్లవాభివందనాలతో

… చంటి (చంద్రన్న) ప్రధాన కార్యదర్శి,

కేంద్రకమిటీ సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ

పెద్ద మనుషులుంటారు.. వారికి తల్లిపాలు కావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *