*ఎదురు కాల్పుల పేరిట ఆదివాసీల మారణకాండకు సిపిఐ ఎంఎల్ న్యూ డేమోక్రసీ ఖండన*
దేశప్రజల ఆస్తులైన అడవుల్ని కార్పొరేట్లకు అప్పగించే రక్తసిక్త కుట్రల్ని ఖందించండి*
మధ్య భారతంలోని అడవుల్లో మోడీ ప్రభుత్వం నెత్తుటేరులు పారిస్తున్నది. బీజాపూర్ లో నిన్న మరో 31 మంది మావోయిస్టుల్ని ఎదురు కాల్పుల పేరిట చంపింది. ఎదురు కాల్పులకు బలం చేకూర్చే కట్టుకదలో భాగంగా, ఇద్దరు జవాన్లు కూడా మరణించారని అధికారులు రిపోర్ట్ చేసారు. ఆ చనిపోయిన వారిలో ఆదివాసులు ఎందరో, మావోయిస్టులు ఎందరో స్పష్టత లేదు. మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వ రంగానికి మన దేశ ప్రజల అడవుల్ని అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు అప్పగించే పధకం పన్నింది. దానికి అడ్డంకిగా వున్న ఆదివాసీల పై యుద్ధం ప్రకటించింది. అటవీ సంపదను ఖనిజాలను వనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి మోదీ ప్రభుత్వం ప్రజలపై ఎంతటి హింసను ప్రయోగించడాని కూడా వెనుకాడడం లేదు. దేశంలో ఆదివాసీలపై జరిగే హింసాకాండను కేవలం ఆదివాసీల సమస్యగా చూడొద్దని, అటవీ సంపద దేశ వ్యాప్తంగా ప్రజలందరి సంపదగా భావించి దేశప్రజలందరు మోడీ కగార్ కి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలనీ, విప్లవ, వామపక్ష, పౌర హక్కుల సంఘాలతో కలిపి రాష్త్ర వ్యాపితంగా ధర్నాలకు పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. మోడీ సర్కార్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలకి కూడా అర్బన్ నక్సల్స్ గా ముద్రలు వేస్తుంది. ఇప్పటికే ఆదివాసీలను అడవుల నుండి గెంటి వేయడానికి 1/70 చట్టాన్ని, పీసా చట్టాన్ని నీరు గార్చే చర్యలకు పూనుకుంది. 2026 నాటికి నక్సల్స్ రహిత భారత్ ను ఏర్పాటు చేస్తామనే పేరుతో ఆదివాసీ ప్రాంతాలలోపారా మిలిటరీ బలగాలను, కోబ్రాలను రకరకాల పోలీస్ బలగాలని ఉపయోగించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ను ఉపయోగించి ఈ సామూహిక హత్యలకు మోడీ ప్రభుత్వం పాల్డుతుంది. ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న హింసాకాండను ఊచకోతలను తక్షణమే నిలిపి వేయాలని సి.పి.ఐ (ఏం.ఎల్ ) న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపై సుప్రీం కోర్టు న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. పి.ప్రసాద్ చిట్టి పాటి వెంకటేశ్వర్లు
రాష్ట్ర అధికార ప్రతినిధులు
9490700715సి.పి. ఐ (ఏం.ఎల్) న్యూ డెమోక్రసీ
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీవిజయవాడ,
