మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేత రాజు
రాష్ట్ర సర్కార్ నిర్ణయం పై హర్షం
కీసర జనవరి 02 :కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన మహా సాధ్వీ సావిత్రీబాయి ఫూలే అని
మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేత రాజు . జనవరి 3న చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ, ప్రతి సంవత్సరం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ఎంతో సంతోషాన్ని కలిగించిందనీ
మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేత రాజు హర్షం ప్రకటించారు.
కుల వివక్షతపై పోరాటం చేసిన వారిలో సావిత్రీబాయి దంపతులు ముందు వరసలో ఉంటారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనీ చదువుకుంటున్న రోజుల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సావిత్రిబాయి ఆడపిల్లలు చదువుకోవడం ఎంత కష్టమో అర్థం చేసుకున్నారు. అందుకే బాలికలకు విద్యను అందించాలని ఆమె పోరాడారన్నారు. ఆమె విద్యావేత్త మాత్రమే కాదు ఒక అద్భుతమైన కవయిత్రి అని జీవితంలో వివక్ష, కుల అఘాయిత్యాలు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఎన్నో పద్యాలు రాశారని ‘‘కావ్యఫూల్’’ అనే కవితా సంపుటి ఆమె చేతినుంచి జాలువారిందే అని తెలిపారు. అందులోని కవితలు సమాజంలో అవిద్యను రూపుమాపి, కులాలకతీతంగా అందరూ విద్యాహక్కు కలిగుండాలనే భావాలతో రాసినవని మహిళ అభ్యుదయ వాదిగా ఆమె చేసిన సేవలు జాతి మొత్తం గుర్తుపెట్టుకుంటుందని ఆమె పేరిట మహిళ ఉపాధ్యాయుల దినోత్సవం గా ప్రకటించడం ఎంత గొప్ప విషయమని డైరెక్టర్ ఈగ శ్వేత రాజు అభిశంసించారు..