Breaking News

రామరాజ్యం అంటే హింసాత్మక దాడులా?

రంగరాజన్ పై మతోన్మాద మూక దాడిని ముక్తకంఠంతో ఖండించిన ప్రజా సంఘాలు, నాయకులు

-త్రిశూల్ పేరుతో యువతరం చేతుల్లో మారణాయుధాలు

జైభారత్ జాతీయ ప్రదాన కార్యదర్శి రమణమూర్తి

అసమానతలపై ధర్మపోరాటం చేయాలి

=అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామి

ఒక సోక్రటీస్‌.. ఒక భగత్‌ సింగ్‌

-మతోన్మాదుల నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవాలికేవీపీఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజాసంఘాల నేతలు

చి లుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై రామరాజ్య స్థాపన ఆర్మీ పేరిట వీర రాఘవరెడ్డి అనే మతోన్మాది 20 మందితో కలిసి మూకుమ్మడిగా దాడి చేయడాన్ని ప్రతీ పౌరుడు ఖండించాలని జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణ మూర్తి అన్నారు.సోమవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్ లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నీఫ్వహించారు కేవీపీఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు అధ్యక్షత వహించి తీర్మాణం ప్రవేశపెట్టారు.ముఖ్యఅతిథిగా హాజరైన జై భారత్ జాతీయ కార్యదర్శి రమణమూర్తి మాట్లాడుతూ రంగరాజన్ ను బెదిరించడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేశారని అడ్డువచ్చిన తన కుమారుడిపై కూడా దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు

వీర రాఘవరెడ్డి అనే మతోన్మాది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే పేరుతో రామ రాజ్యాన్ని స్థాపించడానికి సైన్యం కావాలని ,అందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 27,800 గ్రామాల్లో ప్రతి టెంపుల్ నుంచి ఒక యువ సైనికుడు తమ ఆర్మీలో చేర్పించే బాధ్యత అర్చకులదేనని,తాను ఇక్ష్వాక వంశం శ్రీరాముడి వంశీయుడిని కాబట్టి ఇక్కడి దేవాలయ భూములు తమకు అప్పగించాలని, సైన్యం నిర్వహణ కోసం నిధులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని చెప్పారు. హిందూ ధర్మం కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధమని చెప్పడం అంటే ప్రజల ప్రాణాలతో చేలగాటమేనని చెప్పారువిరుద్ధ భావాలు కలిగిన విపక్షం పాలకపక్షం వామపక్షాలు ఖండించడాన్ని ఆయన స్వాగతించారు రామరాజ్య ఆర్మీ రాజ్యాంగేతర శక్తిగా అవతరిస్తుందన్నారు .హిందూ ధర్మం పేరిట యువకులు నిధులు,భూములు విశ్వాసాలు పేరుతో బహిరంగంగా దాడులు చేయటం ఒక సంస్కృతిగా మారిందన్నారు దీనిని మతసామరస్యం కోరే ప్రతీ ఒక్కరు ఖండించాలన్నారు వీరరాఘవరెడ్డి గతంలో ఒక జిల్లా కలెక్టర్ ను 43 సి ఆర్ పి సి ప్రకారంగా నేను అదుపులోకి తీసుకున్నానని సిఐతోనే ఫోన్ లో మాట్లాడిన పరిస్థితి ఉందన్నారు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని తమ అభిప్రాయాలను ఏకీభవించని వారిపైన భౌతిక దాడులు చేయడం వెనుక ఉన్న శక్తులను బండారం బయటపెట్టాలన్నారు కేరళలో సిపిఎం నాయకత్వంలోని వాముపక్ష ప్రభుత్వం దళితులను పూజారులుగా నియమించిందన్నారురంగరాజన్ పరస్త్రీ అనే దళితుడిని భుజాల ఎత్తుకొని ఊరేగింపు చేశారని ఆ తర్వాత అర్చకుడిగా మార్చారని దీనిని జీర్ణించుకోలేక మతోన్మాద శక్తులు ఆయన పై దాడులకు ఒడిగడుతున్నారని చెప్పారు త్రిశూల్ పేరుతో భావి యువతరానికి మారణాయుధాలు కత్తులు తుపాకులు ఇచ్చి దేశాన్ని మతోన్మాద హింస వైపు నడిపించడానికి మతోన్మాద శక్తులు చేస్తున్న కుట్రలను ప్రతిఘటించాలన్నారు

అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్సామి మాట్లాడుతూ* ఉన్మాదం తలకెక్కిన వీర రాఘవరెడ్డి లాంటి వ్యక్తులు రాష్ట్రంలో దేశంలో అనేక మంది ఉన్నారని అలాంటి వారిని పౌర సమాజం ఏరివేయాలని కోరారు వీర రాఘవరెడ్డి స్థానంలో ఒక సెక్యులర్ వాది ఓ నాస్తికుడు మాట్లాడితే గతంలో ఎన్నో దాడులు దౌర్జన్యాలు చేశారో రాష్ట్రం కళ్లారా చూసిందన్నారు.రాష్ట్రంలో 128 కుల దురహంకార హత్యలు జరిగితే ఏ ఒక్క హత్య పైన స్పందించని ఆర్ఎస్ఎస్ బిజెపి విహెచ్పి హిందూ వాహిని బజరంగ్దళ్ సంస్థలు కేవలం నాగరాజు అనే హిందువుని ముస్లింలు మత దురహంకార హత్యకు పాల్పడితే ఆ ఒక్కదానిపైనే బండి సంజయ్ ,రాజాసింగ్ లు మునేళ్ల పై లేచి రోడ్లపై కొచ్చి పెద్ద ఎత్తున విద్వేషం రెచ్చగొట్టారు.మరీ మిగతా 127 మందివి ప్రాణాలు కాదా ?వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడలేదు? పైగా మిర్యాలగూడలో పెరుమాండ్ల ప్రణయ్ ని 1కోటి రూపాయలు సుఫారీ ఇచ్చి చంపించిన హాంతకుడు మారుతిరావు కు మద్దతుగా భజరంగ్ దళ్ నల్గొండలోర్యాలీ చేసిందన్నారు ఒక హిందూ మరో హిందువుని చంపితే మాట్లాడని వారు ఒక హిందువులు ముస్లిం చంపితే మాత్రమే మాట్లాడుతారా? మత ఘర్షణలు పెంచడానికి ముందుకు వస్తారని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత దేశంలో తమ అభిప్రాయాలతో ఏకీభవించని వారిపైన భౌతిక దాడులకు సిద్ధపడటం అంటే రాజ్యాంగాన్ని పౌరుల ప్రాథమిక హక్కుల్ని పాతాళంలోకి తొక్కడమేనన్నారు

టి పీఎస్ కె రాష్ట్ర నాయకులు జి రాములు ఎస్వీకే కార్యదర్శి ఎస్ వినాయకుమార్ లు మాట్లాడుతూ రామరాజ్యం జైశ్రీరామ్ ఇలాంటి పదాలు భౌతిక దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు చేయడానికి ఉపయోగిస్తున్న పదాలుగా ఉండటం శోచనీయమన్నారు హత్యలను దాడులను హిందూ ధర్మం అంగీకరిస్తుందా? వారి సీద్ధాంతీలు సెలవివ్వాలన్నారు ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ను హత్య చేసిన తర్వాత హంతకులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ పరారయ్యారని చెప్పారు శ్రీరాముడు ఇండ్లపై పడి దౌర్జన్యం చేయమని భూములు లాక్కోమ్మని తనకు రాజ్యం కావాలని దానికి సైన్యం కావాలని సైన్యం ఏర్పాటు చేయండని కోరుకున్నాడా? ఆ సైన్యం కోసం డబ్బులు ఇవ్వమని ఇవ్వకపోతే చంపమని శ్రీరాముడు ఏమైనా ఆదేశించాడ అని ప్రశ్నించారు

పెద్ద మనుషులుంటారు.. వారికి తల్లిపాలు కావాలి

అవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం డి అబ్బాస్ తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ లు మాట్లాడుతూ*కేంద్రంలో అధికారంలో ఉన్న ఆర్ ఎస్ ఎస్ కనుసన్నల్లోని బీజేపీ అండదండలతోటి దేశంలో మతవిద్వేషాలు హింసాత్మక మతోన్మాద దాడులు పెట్రేగి పోతున్నాయని చెప్పారు .పొద్దున లేస్తే హిందూ మతం ప్రమాదం లో ఉందని చెబుతున్న వారు ఆ మతాన్ని విశ్వసిస్తున్న మెజార్టీ ప్రజలకు ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని చెప్పారు హిందూమతంలోని సాధారణ ప్రజలకు ముస్లింలతోనూ క్రైస్తవులతోనూ ఏమాత్రం ప్రమాదం లేదన్నారు ఎవరి మత విశ్వాసాలతో వాళ్లు జీవన విధానం సాగిస్తున్నారని హిందూ మతంలోని మత ఉన్మాదుల వల్లే హిందూ మతం ప్రమాదంలో ఉందన్నారు

కేవీపీఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ*రాష్ట్ర ప్రభుత్వం రంగరాజన్ పై జరిగిన దాడిని స్వయంగా సీఎం ఫోన్లో మాట్లాడి ఖండించినట్లుగానే రాష్ట్రంలో జరిగిన కుల దురహంకారుల హత్యలసందర్భంగా బాధితులకు అండగా నిలబడగలిగితే ప్రభుత్వం పట్ల పేదలకు ఒక మేరకు నమ్మకం కలుగుతుందన్నారు కానీ ఆ పాత్ర ప్రభుత్వం నిర్వహించటం లేదన్నారు దీంతో ప్రభుత్వ స్వభావం కూడా విధితమవుతుంది రంగరాజన్ పై భౌతిక దాడికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా జీవితాంతం జైలులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో మతోన్మాద ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పౌర సమాజం అడ్డుకోవాలి ప్రతిఘటించాలి అని అన్నారు

రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, జనవిజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి కృష్ణాజీ ,డిబి ఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్, డిహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్, ఎన్పిఆర్డి రాష్ట్ర అధ్యక్షులు కే వెంకట్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బుర్రి ప్రసాద్, బొప్పని పద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, చినుకు సంస్థ డైరెక్టర్ పి ఎన్ మూర్తి, దక్షిణ భారతదేశ రాజకీయ సమైక్య జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు రషీద్ ద్రవిడ, కెవిపిఎస్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఎం దశరథ్ బి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *