Breaking News

పుకార్లను నమ్మి ప్రజలు భయపడవద్దు

నర్సంపేటలో దెయ్యం దాడి చేయడం అబద్ధం

. పుకార్లను నమ్మి ప్రజలు భయపడవద్దు.

చార్వాక -SSF

వరంగల్ జిల్లాలోని నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ముత్తోజిపేట దగ్గర్లో రైస్ మిల్లు దగ్గర ట్రాక్టర్ డ్రైవర్ పైన దెయ్యం దాడి (Ghost attack) చేసిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కలకలం రేపుతున్నాయి. గత రెండు,మూడు రోజులుగా ఫోటోలు పెడుతూ ఎక్కువమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఫేక్ పోస్టులను కొందరు సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. నేటికీ మనదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా సరే అదే స్థాయిలో మూఢ నమ్మకాలు సైతం జనాల్లో పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి నమ్మకాలు నమ్మే వారి సంఖ్య అధికమవుతుంది. దున్నపోతు ఈనింది అనగానే దూడను కట్టేయండి అని చెప్పే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది… అసలు దున్నపోతు ఈనింది అనగానే ముందుగా అనాల్సిన మాట ఏమిటంటే దున్నపోతు ఈనుతుందా అని ప్రశ్నించాలి…? నిజానికి ప్రస్తుత సమాజంలో ఇందుకు భిన్నంగా దూడను కట్టేయమని అనడం ఎంతవరకు సమంజసం. ఇటువంటి అశాస్త్రీయ భావజాలం ప్రజల్లో విపరీతంగా పెరుగుతోంది. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట నుండి ముత్యాలమ్మ తండా వెళ్లే వైపుగా గల ఒక రైస్ మిల్లు దగ్గరలో పెద్ద మర్రి చెట్టు ఉంది. అయితే ఆ ప్రాంతంలో దెయ్యం ఉందని ప్రచారం గత కొంత కాలంగా ఉంది.

ఈ నేపథ్యంలో గత రెండు,మూడు రోజుల కిందట అర్థ రాత్రి అటుగా వెళ్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ పై (ట్రాక్టర్ డ్రైవర్ ను దేయ్యం గాయపరిచింది) దెయ్యం గాయపరించిందని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు వైరల్గా మారాయి. అయితే వాస్తవానికి స్థానిక గ్రామ పరిసరాల్లో ఉంటున్న ఏ ఒక్క ట్రాక్టర్ డ్రైవర్ కూడా గాయపడిన దాఖలాలు లేవని వాస్తవ పరిశీలనలో స్పష్టమవుతున్నది. మనిషి చనిపోయిన తర్వాత దెయ్యంగా మారడం అనేది శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. అంతేకాకుండా ఇప్పటివరకు ఎవరు కూడా దానిని నిరూపించలేదు. కానీ కొంతమంది శాస్త్ర విజ్ఞాన పరంగా ఎంతో ఎదుగుతున్నప్పటికీ వేల సంవత్సరాలుగా వస్తున్న మూఢనమ్మకాల నుండి బయటపడలేకపోతున్నారు. అందులో ప్రధానమైనది దయ్యం ఉంది అని భ్రమ పడడం.అయినప్పటికీ పరిసర గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురికా వద్దని వాస్తవానికి దయ్యం అనేది లేదని అది కేవలం మానసిక భ్రమ మాత్రమే కావున ప్రజలు ఎవరూ భయభ్రాంతులకు గురికావద్దు ఇటువంటి అశాస్త్రీయ భావజాలాన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మార్చే వ్యక్తులపైన ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి

ఒక సోక్రటీస్‌.. ఒక భగత్‌ సింగ్‌

అదేవిధంగా నర్సంపేట మునిసిపాలిటీ మరియు పరిసర గ్రామాల్లో మూఢనమ్మకాల నిర్మూలన కోసం బహిరంగ సభలు,మ్యాజిక్ షోలు నిర్వహించి ప్రజలకు శాస్త్రీయ దృక్పథం మరియు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా టీవీ ప్రసార మాధ్యమాల ద్వారా మరియు సామాజికవేత్తలు,శాస్త్రవేత్తల నుండి వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి.

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని అయ్యప్ప మాల ధరించిన కొంతమంది విద్యార్థి కాళ్లు మొక్కించడం అదేవిధంగా వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడని సొంత కూతురు భర్తను హత్య చేయడం ఇటువంటి సంఘటనలు తెలంగాణలో నిత్యం ఏదో ఒకచోట జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద రామ రాజ్యం అనే సంఘ నాయకులు, కార్యకర్తలు కలిసి దాడి చేయడానికి ఖండిస్తున్నాం. రంగరాజన్ గారు తన భుజాల మీద ఆదిత్య అనే దళితుడిని ఆలయంలోకి తీసుకొని వెళ్ళాడు దీనిని ఒక పండగలా చేశాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని బహిరంగంగానే విమర్శలు చేస్తూ రంగరాజన్ పైన భౌతిక దాడి చేశారు. ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడుతున్న వారిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం ప్రభుత్వాధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని లేనిచో ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది.

ఉద్యమాభివందనాలతో……

చార్వాక –

ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్

పెద్ద మనుషులుంటారు.. వారికి తల్లిపాలు కావాలి

SSF(శాస్త్రీయ అధ్యయన వేదిక)

SCIENTIFIC STUDY FORUM

9347284111.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *