తెలుగు బహుజన మహాసభ – మడైల్యాండ్ ఆధ్వర్యంలో మన దేశీయ గొప్ప హేతువాది, ఇండియన్ సోక్రటీస్ సంత్ గాడ్గేబాబా 149వ జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి ముంబైలోని మడైల్యాండ్ లో ఘనంగా నిర్వహించారు. ఆరంభంలో కార్యకర్తలు దేబుజి చిత్రపటాన్ని చేతబూని జోహార్లు తెల్పారు.
ఈ సందర్భంగా మహాసభ ప్రముఖులు ఆవుల చిన్నబసప్ప మహారాజ్ మాట్లాడుతూ గాడ్గే దేబుజి తన జీవితాంతం మూడనమ్మకాలకు విరుద్ధంగా సామాన్య జనానికి అర్థమైయేటట్లు హేతువాదాన్ని ప్రచారం ప్రసారం చేశారని, రాళ్ళను రప్పలను దేవుడిగా నమ్మడం కంటే అభాగ్యులను ఆదుకోవడంలోనే పుణ్యం లభిస్తుందని, దేనిని గుడ్డిగా నమ్మకుండా ప్రతి అంశాన్ని తర్కించాలని ఎలుగెత్తి చాటిన గొప్ప హేతువాది దేబుజి. మరోవైపు శ్రమజీవులు మద్య పానీయాల నుంచి దూరం ఉంటూ, తమ పిల్లల్ని ఉన్నత చదువుల కోసం ఎనలేని కృషి చేయాలని హితబోధ చేసిన మహనీయులని చిన్నబసప్ప కొనియాడారు.
ఈ జయంతిలో మహాసభ సభ్యులైన సిందాల్ డేవిడ్, సప్పొగ నాగరాజ్, బుర్ల అంజి, అడ్డకుల చౌదరి, బజ్జీల రాం, ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎంటిబిఎఫ్) నాయకులు కున్బి నారాయణ, జంగం లింగోజీ, ఎమ్ల సాయులు, తుమ్మల మార్కు, నేరే డేనియల్, అర్. ఇజాక్, కార్మిక నేతలైన చౌవల్ రమేష్, నరపాక లక్ష్మణ్ మహారాజ్, గాయకులు భీంరత్న మాలజీ, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.

